26, అక్టోబర్ 2015, సోమవారం

బలమయిన సంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిద్దాం!

ప్రభువు మెచ్చితే చాలు..  

 జన్మ ధన్యమైందని 

చెప్పుకునే నారదులున్నారు 

ఒక నేస్తంపై దాడి జరిగినా స్పందించని 

కలాలు, గళాలు ఉన్నాయి 

మతం విషం చిమ్మినప్పుడు 

కవుల, రచయితల, లౌకిక శక్తుల 

గొంతుకలను చిదిమినప్పుడు 

స్పందించని కలాలు గళాలు

బతికున్నా చచ్చినట్టు కాదా ?

మతచందాస వాదుల వికృత క్రీడలను 

రాకాసి పంథాను ప్రశ్నిచండి

కవుల, రచయితల, లౌకిక శక్తులను 

బ్రతికించుకుందాం.. 

ప్రజాస్వామ్యాన్ని రక్చించుకుందాం !

 దాడులను, హత్యలను ఖండిద్దాం.. 

బలమయిన సంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిద్దాం! 

~ మామిండ్ల రమేష్ రాజా

1 కామెంట్‌:

  1. గండపెండేరాలు, ఘనమైన అవార్డులు కావాలీ.
    రాసేది ఇరవై పేజీలు ముందుమాట ఎన్క మాటలే ముప్పయి పేజీలు.
    అవార్డులే అక్షరాల లక్ష్యమైనప్పడు
    అన్నార్తులు, అనాధలు వారికి ఎక్కడా కన్పడతరు.
    అప్పడు వారు రాసింది, రాస్తున్నది దేశ గొప్పతనం
    మన మునుల గొప్ప వారసత్వం వేదాల్లోని సారం
    గీత మన రాత మారస్తుందని రోత రాతలు రాస్తున్న కవిపుంగవులకు
    ప్రజల వెతలు కనపడవు, అవి వారికి కథలుగా తోస్తాయి.
    భూతాలుగా మారిన మీరు అభూత కల్పనలు రాస్తే తప్పులేదు
    ఇదిగో నిజం అంటే మాత్రం ఓర్చుకోలేరా ఇదేనా మీరు వల్లిస్తున్న సహనం..
    చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి చిల్లర పనులు

    సిగ్గులేని మేధావులకి, బుద్ది లేని రాజకీయనాయకుల అండ
    రాజ్యాంగం అంటే ఎంత అలుసయింది మంత్రులకి ముఖ్యమంత్రులకి
    వారు ప్రమాణం చేసిన రాజ్యాంగాన్నే కించపరుస్తూ
    దేశంలో ఆహార అలవాట్లపై అడ్డగోలు కామెంట్లు
    అంతేలే వారికి సమాజం అంటే సంఘ్ మాత్రమే
    వారికి మనుషులంటే హిందువులే
    అవును నాకో డౌట్ అన్నీ వదిలేసిన సన్యాసులకి
    అమాత్య పదవులు, ఎంపి పదవులు ఎందుకో
    ఈ లోకమే మిథ్య అంటున్న వారికి చట్ట సభలెందుకో

    నిజమే గోవును తినడం తప్పే.. అదీ దళితులు, మైనార్టీలు తింటారా
    ఎంత ధైర్యం మ్లేఛ్చులకి అడ్డమైన వాళ్లు తింటుంటే ఆగుతారా
    తలలు తెగనరుకుతారు.
    గోవును తింటే బ్రాహ్మణులే తినాలి.
    గోవును వాళ్లు తినడం మానేస్తే అంతా మానేయాలి.
    ఫత్వాకి వీళ్ల ఆదేశాలకు తేడా ఏంటో?????
    గోవును ఇస్తే వాళ్లకే దానం ఇవ్వాలి.
    గోవు పాలు గోవు నెయ్యి ఆఖరికి గోవు ఉచ్చ కూడా వారికే సొంతం.
    ఎందుకంటే యాగాలు చేసింది గోవుల కోసం
    యాగ పశువుల పేరుతో గోవులను బలిచ్చింది వాళ్లే
    ఆవు కాయంలో ఏ అవయవం ఎవరు తినాలో రాసింది మనువు
    వారు అమలు చేస్తుంది మనుస్మ్రతినే కదా
    రాజుల దగ్గర కానుకల రూపంలో దొబ్బింది ఆవులనే
    అటువంటి ఆవులను అలగాజనం తింటే ఊరుకుంటారా
    అయినా గోవు మిథ్య మాంసం మిథ్య కదా
    అన్నీ పరమాత్ముని రూపమే కదా
    అన్నీ ఆయనలో కలిసేవే కదా


    కెన్యాలో గోవు రక్తం తాగుతారు కానీ గోవును తినరు.
    గోవును తిన్నది నూటికి నూరుపాళ్లు వాళ్లే
    అది వేదాల్లో రాసుకున్నారు.
    కెన్యాలో కులం లేదు అక్కడ గోవు రక్తమే తాగుతున్నారు
    ఇక్కడ మాత్రం కులం పేరుతో సాటి మనుషుల రక్తం తాగుతున్న
    నరరూప రాక్షసులు నీతులు చెబుతున్నారు
    మా తాతలు బానిసలుగా ఉంటే మా తండ్రులు వెట్టి చేశారు.
    ఇంకానా మీ వెట్టి అని మేం అంటే కత్తి కట్టారు.
    మా పూర్వీకులను ప్రత్యక్షంగా లక్ష్యం చేసుకున్నారు
    మా పైన పరోక్ష దాడి అంతే తేడా దాడి మాత్రం జరుగుతూనే ఉంది.

    రిప్లయితొలగించండి