27, నవంబర్ 2015, శుక్రవారం

నిజాన్ని మరిచి.. 

నిజాన్ని మరిచి 
అబద్దమే ఓ బతుకులా
నడవడిక నేర్చుకున్నా
నేస్తమా!
ఇపుడేమాన్టవో..
నీవు నీవుగా ఉన్నావా?
ఏన్ని మలుపులు తిరిగిందో
నీ జీవితం
ఏ ఓడ్డుకు చేరిందో
నీ పయనం
ఓ సారి మననం చేసుకున్టివా?
ఆకాశంలో సుడులు తిరుగుతున్నా
గాలి పటంలా..
తెగిపడినా తోక చుక్కలా..
రంగుల ప్రపంచం
నిజాన్ని మరిచి
బతుకు  అబద్దమయింది కదూ!

                                   - మామిండ్ల రమేష్ రాజా

24, నవంబర్ 2015, మంగళవారం

పాలకురికి రచనల్లో..

పాలకురికి రచనల్లో..

ఎర్రేరని దారుల్లో..
ఎర్రపూల వనముల్లో.. 
పొడిచేటి పొద్దుల్లో.. 
పాలకుర్తి దారుల్లో.. 
దిక్కార స్వరముంది.. 
ప్రశ్నించే తత్వముంది.. 
కోడి పుంజు కూతల్లో.. 
మేలుకొలిపే పాలకురికి రచనల్లో..  

                                                     - మామిండ్ల రమేష్ రాజా, 7893230218. 

26, అక్టోబర్ 2015, సోమవారం

బలమయిన సంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిద్దాం!

ప్రభువు మెచ్చితే చాలు..  

 జన్మ ధన్యమైందని 

చెప్పుకునే నారదులున్నారు 

ఒక నేస్తంపై దాడి జరిగినా స్పందించని 

కలాలు, గళాలు ఉన్నాయి 

మతం విషం చిమ్మినప్పుడు 

కవుల, రచయితల, లౌకిక శక్తుల 

గొంతుకలను చిదిమినప్పుడు 

స్పందించని కలాలు గళాలు

బతికున్నా చచ్చినట్టు కాదా ?

మతచందాస వాదుల వికృత క్రీడలను 

రాకాసి పంథాను ప్రశ్నిచండి

కవుల, రచయితల, లౌకిక శక్తులను 

బ్రతికించుకుందాం.. 

ప్రజాస్వామ్యాన్ని రక్చించుకుందాం !

 దాడులను, హత్యలను ఖండిద్దాం.. 

బలమయిన సంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిద్దాం! 

~ మామిండ్ల రమేష్ రాజా

14, సెప్టెంబర్ 2015, సోమవారం

రైతన్నా బతుకాలి

రైతు ఉరి వేసుకున్డు
తనకీ భరోసా లేదనీ..
ఈ రాష్ట్రంలో బతుకు దెరువు కరువైందని
ఉరి పోసుకుండు
ప్రాణమే విడిచిన్డు
ఆత్మహత్యలను హేళన చెయ్యబట్టే
ఏలికలు..
మాకు దిక్కెవ్వరని రైతు ప్రశ్నిస్తుండు
జవాబు చెప్పని పాలకులు
నపున్సకత్వంతో.. చేతకాని తనం తో..
చస్తుండ్రని సెలవిచారు
ఏంటి ఈ ఘోరం
రైతుల ఉసురుదిస్తున్న విదానాలను ప్రశ్నిచేందుకు
రైతన్నా బతుకాలి
రైతన్నను బతికించుకోవాలి
                             - మామిండ్ల రమేష్ రాజా